అఖిలపక్షాన్ని జగన్ ఢిల్లీకి తీసుకెళ్లాలి: రామకృష్ణబాబు

ABN , First Publish Date - 2021-02-05T19:00:27+05:30 IST

విశాఖపట్నం: ప్రజలు ప్రాణత్యాగం చేసి విశాఖ స్టీల్ ఫ్లాంట్ సాధించుకున్నారని.. దానిని ప్రైవేటు పరం చేయడం

అఖిలపక్షాన్ని జగన్ ఢిల్లీకి తీసుకెళ్లాలి: రామకృష్ణబాబు

విశాఖపట్నం: ప్రజలు ప్రాణత్యాగం చేసి విశాఖ స్టీల్ ఫ్లాంట్ సాధించుకున్నారని.. దానిని ప్రైవేటు పరం చేయడం దారుణమని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు. విశాఖ ప్రజల గుండె లాంటి స్టీల్ ఫ్లాంటును కాపాడుకోవాల్సిన అవసరం మన అందరిపైనా ఉందన్నారు. ఎట్టి పరిస్టితుల్లోనూ విశాఖ స్టీల్ ఫ్లాంటు ప్రైవేటు పర్వం కానివ్వబోమని వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం సీఎం జగన్ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకు వెళ్ళాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని రామకృష్ణ బాబు కోరారు.


Updated Date - 2021-02-05T19:00:27+05:30 IST