గోదావరి జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2021-08-10T21:58:33+05:30 IST

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా నిదడవోలు పరిసరాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీ వర్షం కురిసింది.

గోదావరి జిల్లాలో భారీ వర్షం

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా నిదడవోలు పరిసరాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భారీ వర్షం కురిసింది. రోడ్లు మొత్తం చెరువులను తలపించాయి. రైల్వే స్టేషన్ రోడ్డు, బస్టాండ్ పరిసరాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే ప్రాంతాల్లో రెండు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - 2021-08-10T21:58:33+05:30 IST