రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

ABN , First Publish Date - 2021-05-02T12:24:28+05:30 IST

దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత పెరగడం, పలుచోట్ల ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు ఏర్పడిన నేపథ్యంలో బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలం మీదకు

రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు

విశాఖపట్నం: దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత పెరగడం, పలుచోట్ల ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు ఏర్పడిన నేపథ్యంలో బంగాళాఖాతం నుంచి తేమగాలులు భూ ఉపరితలం మీదకు వీస్తున్నాయి. దీంతో శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 2 రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం కడపలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

Updated Date - 2021-05-02T12:24:28+05:30 IST