బలహీనపడ్డ అల్పపీడనం

ABN , First Publish Date - 2021-08-20T08:15:44+05:30 IST

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పూర్తిగా బలహీనపడింది. దీంతో రాష్ట్రం మీదుగా పశ్చిమ, నైరుతి గాలుల ప్రభావం మళ్లీ మొదలైంది.

బలహీనపడ్డ అల్పపీడనం

అమరావతి/విశాఖపట్నం, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పూర్తిగా బలహీనపడింది. దీంతో రాష్ట్రం మీదుగా పశ్చిమ, నైరుతి గాలుల ప్రభావం మళ్లీ మొదలైంది. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. ఇతర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పడ్డాయి. శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

Updated Date - 2021-08-20T08:15:44+05:30 IST