రాహుల్‌ హత్య కేసులో ‘కోగంటి’కి రిమాండ్‌

ABN , First Publish Date - 2021-08-25T09:13:20+05:30 IST

యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ అలియాస్‌ సత్యంను మాచవరం పోలీసులు

రాహుల్‌ హత్య కేసులో ‘కోగంటి’కి రిమాండ్‌

విజయవాడ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న పారిశ్రామికవేత్త కోగంటి సత్యనారాయణ అలియాస్‌ సత్యంను మాచవరం పోలీసులు విజయవాడలోని మొదటి అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో మంగళవారం హాజరుపరిచారు. ఈ కేసులో కోగంటిని పోలీసులు సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించగా, హాజరు కాకుండా బెంగళూరు వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు బెంగళూరు విమానాశ్రయ పోలీసులను అప్రమత్తం చేశారు. ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం కోగంటిని ట్రాన్సిట్‌ వారెంట్‌పై మంగళవారం ఉదయం విజయవాడకు తీసుకొచ్చారు. కోర్టులో హాజరుపరచగా... న్యాయమూర్తి కమలాకర్‌రెడ్డి వచ్చే నెల ఏడో తేదీ వరకు రిమాండ్‌ విధించారు. ఆ తర్వాత కోగంటిని మచిలీపట్నం సబ్‌జైలుకు తరలించారు.

Updated Date - 2021-08-25T09:13:20+05:30 IST