రాహుల్ హత్యకేసు నిందితులు కోర్టులో హాజరు

ABN , First Publish Date - 2021-08-27T21:37:19+05:30 IST

పారిశ్రామిక వేత్త రాహుల్ హత్యకేసులో నిందితులకు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితులు కోరాడ విజయ్

రాహుల్ హత్యకేసు నిందితులు కోర్టులో హాజరు

విజయవాడ: పారిశ్రామిక వేత్త రాహుల్ హత్యకేసులో నిందితులకు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. నిందితులు కోరాడ విజయ్, సీతయ్య, బాబు, రాజాకు వైద్యపరీక్షలు నిర్వహించారు. మీడియా కంటపడకుండా నిందితులను కోర్టులో హాజరుపరిచారు. రాహుల్ హత్యకేసుపై సాయంత్రం పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించనున్నారు. రాహుల్ హత్య కేసులో  ఏ-1గా కోరాడ విజయ్‌కుమార్‌, ఏ-2గా కోరాడ పద్మజ, ఏ-3గా గాయత్రి, ఏ-4గా కోగంటి సత్యం పేర్లను చేర్చారు. ఇప్పుడు ఆన్‌లైన్‌(దర్యాప్తు తర్వాత)లో అందుబాటులో ఉంచిన ఎఫ్‌ఐఆర్‌లో ఏ-1గా కోరాడ విజయ్‌కుమార్‌, ఏ-2గా కోగంటి సత్యం, ఏ-3గా కోరాడ పద్మజ, ఏ-4గా పద్మజ, ఏ-5గా గాయత్రి పేర్లను చేర్చారు. ఎక్స్‌ప్రెస్‌ ఎఫ్‌ఐఆర్‌లో నలుగురి పేర్లు ఉండగా, ఆన్‌లైన్‌లో ఉంచిన ఎఫ్‌ఐఆర్‌లో ఐదుగురి పేర్లను చేర్చడం గమనార్హం.

Updated Date - 2021-08-27T21:37:19+05:30 IST