తెలుగు అకాడమీని పలుచన చేస్తూ ఏం సందేశమిస్తున్నారు: రఘురామ

ABN , First Publish Date - 2021-07-12T14:23:16+05:30 IST

ఏపీ సీఎం జగన్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. అమ్మ భాషను అదిమేసే చర్యలు-అసందర్భ నిర్ణయాలపై లేఖ రాశారు. తెలుగు అకాడమీని పలుచన చేస్తూ ప్రజలకు

తెలుగు అకాడమీని పలుచన చేస్తూ ఏం సందేశమిస్తున్నారు: రఘురామ

ఢిల్లీ: ఏపీ సీఎం జగన్‌రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. అమ్మ భాషను అదిమేసే చర్యలు-అసందర్భ నిర్ణయాలపై లేఖ రాశారు. తెలుగు అకాడమీని పలుచన చేస్తూ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని చేర్చే ఏకపక్ష నిర్ణయం సరికాదన్నారు. ఈ విషయంపై యార్లగడ్డ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మహనీయులను మనం గుర్తుంచుకోకపోయినా పర్వాలేదు కానీ.. వారు చేసిన కృషిని తుడిచిపెట్టేయడం మంచిది కాదన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు, నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని రఘురామ పేర్కొన్నారు. 


Updated Date - 2021-07-12T14:23:16+05:30 IST