ఏపీలో ఇదీ సంగతి!

ABN , First Publish Date - 2021-05-30T08:31:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు, తన పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన వైఖరిని వివరిస్తూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది

ఏపీలో ఇదీ సంగతి!

మోదీ, అమిత్‌షాలకు రఘురామ లేఖ

సమయమిస్తే కలిసి వివరిస్తానని వినతి


న్యూఢిల్లీ, మే 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న  పరిణామాలు, తన పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన వైఖరిని వివరిస్తూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. వ్యక్తిగతంగా కలుసుకుని జరిగిన వివరించేందుకు సమయం ఇవ్వాలని కూడా కోరినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. రఘురామను సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన అనంతరం ఆయన సతీమణి, పిల్లలు అమిత్‌షాను  కలుసుకుని జరిగిన పరిణామాలను వివరించిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-05-30T08:31:26+05:30 IST