బీపీలు పెరిగితే దాడులు చేస్తారని సీఎం మాట్లాడడమేంటి?: రఘురామ ఫైర్
ABN , First Publish Date - 2021-10-21T18:18:10+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బోసిడీకే పదానికి వైసీపీ అధికార వెబ్‌సైట్‌లో కొత్త పదాన్ని సృష్టించారని ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీ: వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామ కృష్ణరాజు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బోసిడీకే పదానికి వైసీపీ అధికార వెబ్‌సైట్‌లో కొత్త పదాన్ని సృష్టించారని ఆయన పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘మలినంతో కూడిన మనసులు మీవి. బీపీలు పెరిగితే దాడులు చేస్తారని సీఎం మాట్లాడడమేంటి? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి జగన్ ఇలా మాట్లాడతారా? వైసీపీ నేతలు బూతులు మాట్లాడడం లేదా? గతంలో వైసీపీ నేతలు మాట్లాడిన మాటలు జగన్‌కు గుర్తుకున్నాయా? వైసీపీ నేతలు ఇకనైనా మారాలి. మిమ్మల్ని అనని మాటలకే మీ అత్యుత్సాహకులకు బీపీలు పెరిగిపోతే.. మీపై కోడికత్తి దాడి జరిగినప్పుడు మీ అత్యుత్సాహకులు ఏమయ్యారు? కొందరు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు మారేందుకు ప్రయత్నించాలి’’ అని పేర్కొన్నారు.