కస్టడీలో టీడీపీ నేత పట్టాభిని కొట్టారు: రఘరామకృష్ణరాజు
ABN , First Publish Date - 2021-10-28T19:13:45+05:30 IST
కస్టడీలో టీడీపీ నేత పట్టాభిని కొట్టారని ఎంపీ రఘరామకృష్ణరాజు పేర్కొన్నారు. పట్టాభిని కొట్టారా లేదా అనేది ఎంపీ విజయసాయి చెప్పాలన్నారు.

అమరావతి: కస్టడీలో టీడీపీ నేత పట్టాభిని కొట్టారని ఎంపీ రఘరామకృష్ణరాజు పేర్కొన్నారు. పట్టాభిని కొట్టారా లేదా అనేది ఎంపీ విజయసాయి చెప్పాలన్నారు. పట్టాభిని కొట్టారన్న దానిపై తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. ఏపీలో ప్రభుత్వానికి, పోలీసులకు తేడా లేదన్నారు. పోలీసులు అంటే తనకు గౌరవం ఉందన్నారు. కొందరి వల్ల పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని రఘురామ పేర్కొన్నారు.