హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: రఘురామ

ABN , First Publish Date - 2021-09-03T20:37:26+05:30 IST

ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: రఘురామ

న్యూఢిల్లీ: ఏపీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయని, వీలైనంత తొందరగా ఈ సమస్యను సీఎం జగన్ పరిష్కరించాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి భూములపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్ ఎక్కడ జరగలేదని హైకోర్టు తేల్చిచెప్పిందని, రాజధాని మార్పునకు సీఎం జగన్, కొందరు మంత్రులు చెబుతున్న సాకులు.. సహేతుకం కాదని హైకోర్టు తీర్పుతో స్పష్టమైందన్నారు. అమరావతే ఏపీకి రాజధాని అని, అంతిమ విజయం రైతులదే అవుతుందని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-09-03T20:37:26+05:30 IST