విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌

ABN , First Publish Date - 2021-08-04T00:50:57+05:30 IST

ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు.

విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్‌

హైదరాబాద్‌: ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పిటిషన్‌లో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. విదేశాలకు పారిపోయేందుకు విజయసాయి చూస్తున్నారని, 2 రోజుల్లో ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్ వేస్తానని రఘురామ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆర్థిక నేరాలు, అక్రమాస్తుల కేసులో 11 చార్జిషీట్లలో ఏ1 ఉన్న జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులో రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన సీఎం పదవిని అడ్డుపెట్టుకుని కేసులను నీరుగారుస్తూ, సీబీఐ అధికారులు, సాక్ష్యాలను ప్రలోభాలకు గురిచేస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరిస్తున్నారని అందువల్ల బెయిల్ రద్దు చేయాలని హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Updated Date - 2021-08-04T00:50:57+05:30 IST