చంద్రబాబూ బోష్‌డీకే.. అర్థం తెలుసా?
ABN , First Publish Date - 2021-10-20T08:40:37+05:30 IST
‘‘చంద్రబాబూ బోష్‌డీకే అంటే అర్థం తెలుసా? ఇదేమాట నిన్నంటే ఊరుకుంటావా?’’ అని వైసీపీ ఎమ్మెల్యేలు కొలుసు

నిన్నంటే ఊరుకుంటావా?.. అధికార పార్టీ నేతల ప్రశ్న
బాబు క్షమాపణ చెప్పాలి: సజ్జల
అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): ‘‘చంద్రబాబూ బోష్‌డీకే అంటే అర్థం తెలుసా? ఇదేమాట నిన్నంటే ఊరుకుంటావా?’’ అని వైసీపీ ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, మేరుగ నాగార్జున, రాజన్న దొర, హఫీజ్‌ఖాన్, వసంత కృష్ణప్రసాద్ ప్రశ్నించారు. టీడీపీ అధికార ప్రతినిధి అలాంటి వ్యాఖ్యలు చేస్తే కనీసం విచారం వ్యక్తంచేయరా? అని అన్నారు. ‘మాట్లాడే స్వేచ్ఛలేదా?’ అని ప్రశ్నిస్తున్న చంద్రబాబు.. బూతులు మాట్లాడడం కూడా హక్కుగానే భావిస్తారా? అని నిలదీశారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో తిట్టించడం ఏంటన్నారు.
నేడు రాష్ట్రవ్యాప్త నిరసన: సజ్జల
టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మాట్లాడిన బూతులపై రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిరసన తెలపనున్నట్టు వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పట్టాభి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.