ఎమ్మెల్యే బాబూరావుకు నిరసన సెగ

ABN , First Publish Date - 2021-12-30T22:53:14+05:30 IST

జిల్లాలోని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు

ఎమ్మెల్యే బాబూరావుకు నిరసన సెగ

విశాఖ: జిల్లాలోని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు నిరసన సెగ తగిలింది. పాయకరావుపేట రాజువరంలో పలు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి  బాబూరావు వచ్చారు. అయితే ఎమ్మెల్యేను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించారు. పార్టీ వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 
Updated Date - 2021-12-30T22:53:14+05:30 IST