రైస్ ఏటీఎం పోటీల్లో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్లకు బహుమతులు
ABN , First Publish Date - 2021-08-26T00:05:34+05:30 IST
నగరంలో నిర్వహించిన రైస్ ఏటీఎం పోటీల్లో ఇద్దరు ఆంధ్రజ్యోతి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని నగరంలో నిర్వహించిన రైస్ ఏటీఎం పోటీల్లో ఇద్దరు ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫొటోగ్రాపర్లకు బహుమతులు వరించాయి. హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్న అశోకుడు యాదవ్‌కు తృతీయ బహుమతి లభించింది. రూ.5,000 నగదు పోత్సాహకం వచ్చింది. విజయనగరం ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ జోగారావుకు కన్సోలేషన్ బహుమతి వరించింది. రూ.2 వేల నగదు లభించింది.
ఈ నెల 19న ప్రపంచ ఫొటోగ్రపీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఫొటో జర్నలిస్టులకు రైస్ ఏటీఎం సంస్థ పోటీలు నిర్వహించింది. విజేతలను బుధవారం ప్రకటించింది. బహుమతులను ఫొటోగ్రాపర్లకు త్వరలో అందజేస్తామని నిర్వాహకులు దోసపాటి రాము, జోన్నలగడ్డ యశస్విని తెలిపారు.
