‘ఎస్ఈసీ నిమ్మగడ్డకు ప్రివిలేజ్ నోటీసు ఇవ్వాలి’

ABN , First Publish Date - 2021-02-01T23:47:04+05:30 IST

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అనుచిత ప్రవర్తనపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, గవర్నర్ బిశ్వభూషన్ త్వరగా ప్రివిలేజ్ నోటీసు ఇవ్వాలని న్యాయవాది విజయ్‌బాబు కోరారు.

‘ఎస్ఈసీ నిమ్మగడ్డకు ప్రివిలేజ్ నోటీసు ఇవ్వాలి’

అమరావతి: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ అనుచిత ప్రవర్తనపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, గవర్నర్ బిశ్వభూషన్ త్వరగా ప్రివిలేజ్ నోటీసు ఇవ్వాలని న్యాయవాది విజయ్‌బాబు కోరారు. దేవాలయాలమీద దాడులు జరిగినప్పుడు స్పందించామని, ఎస్ఈసీ వర్సెస్ ప్రభుత్వం అంశం మీద కూడా స్పందించామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య ఘర్షణ జరుగుతోందన్నారు. హైకోర్టు తీర్పు తనకు ఇచ్చిన కండక్ట్ సర్టిఫికేట్‌గా నిమ్మగడ్డ భావిస్తున్నారని, ఏ ప్రకటన చేసినా కోర్టును ఒక బూచిలా చూపిస్తున్నారని తప్పుబట్టారు. ప్రభుత్వ సలహాదారుపై, మంత్రులపై ఆటోక్రసి చూపిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న ఎస్ఈసీ మరొక రాజ్యాంగ బద్ధమైన సంస్ధ హక్కులను కాలరాయకూడదని విజయ్‌బాబు సూచించారు. 

Updated Date - 2021-02-01T23:47:04+05:30 IST