శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని

ABN , First Publish Date - 2021-12-25T08:33:27+05:30 IST

శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.

శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని

తిరుమల, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. గురువారం తిరుమలకు వచ్చిన ఆయన శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో తన సతీమణి షిరాంతి రాజపక్సేతో కలిసి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోగా, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామి దర్శనానంతరం రంగనాయక మండపానికి చేరుకున్న రాజపక్సేను వేదపండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలను, చిత్రపటాన్ని జేఈవో అందజేశారు. రాజపక్సే వెంట డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఉన్నారు.

Updated Date - 2021-12-25T08:33:27+05:30 IST