ఎస్సీ వర్గీకరణను అడ్డుకోండి

ABN , First Publish Date - 2021-12-08T08:46:54+05:30 IST

ఎస్సీ వర్గీకరణను అడ్డుకోండి

ఎస్సీ వర్గీకరణను అడ్డుకోండి

ఢిల్లీలో మద్దతు కూడగడుతున్న మాలమహానాడు

న్యూఢిల్లీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ చేపట్టొద్దన్న డిమాండ్‌తో మాలమహానాడు ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌వద్ద నిర్వహిస్తున్న ధర్నా మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ధర్నా వేదికను సందర్శించి మద్దతు తెలిపారు. మాలమహానాడు నేతలు ఓ పక్క ధర్నా చేపడుతూ.. మరోపక్క వివిధ పార్టీల నేతలు, ఎంపీలను కలిసి తమ ఆందోళనకు మద్దతు కూడగడుతున్నారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చిన్నయ్య నేతృత్వంలో పలువురు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరిని కలిసి తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరారు.

Updated Date - 2021-12-08T08:46:54+05:30 IST