తూర్పులో ఒత్తిళ్లు, బెదిరింపులు
ABN , First Publish Date - 2021-02-01T10:21:03+05:30 IST
తూర్పు గోదావరి జిల్లా జి.మామిడాడలో నామినేష న్ వేయకుండా ఒక ఎస్సీ మహిళపై వైసీపీ కీలక నేత ఒకరు ఒత్తిడి తెచ్చారు.

కాకినాడ(ఆంధ్రజ్యోతి)/జగ్గంపేట/జగ్గంపేటరూరల్, జనవరి 31: c ఇదే ప్రాంతంలో మరో ఎస్సీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా వైసీపీ కార్యకర్తలు ఒత్తిడి చేశారు. విషయా న్ని సదరు అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశా రు. పెద్దాపురం మండలం కొండపల్లి గ్రామ సర్పంచ్‌గా బీజేపీ తరపున నామినేషన్ వేసిన అభ్యర్థిని అధికార పార్టీ కార్యకర్త లు బెదిరించారు. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే చంపడానికి వెనుకాడబోమని హెచ్చరించడంతో, తనకు ప్రాణహాని ఉందని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సర్పంచ్ అభ్యర్థి భర్త కిడ్నాప్
జగ్గంపేట మండలం గొల్లలగుంట గ్రామ పంచాయతీలో టీడీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పుష్పవ తి సిద్ధమయ్యారు. ఆదివారం నామినేషన్ వేయనుండగా శనివారం అర్ధరాత్రి వైసీపీ నేతలు తన భర్త శ్రీనివాసరెడ్డిని కిడ్నాప్ చేశారని చెప్పారు. రాత్రి 2గంటలకు బహిర్భూమికి బయటకు వచ్చిన తనపై నలుగురు వ్యక్తులు మత్తుమందు చల్లారని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. స్పృహ కోల్పోయిన తన ను గోవిందపురం అడవుల్లో పడవేశారని, ఉదయం అటుగా వెళ్తున్న గొర్రెల కాపరులు చూసి రక్షించారని వివరించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తన అనుచరులను గ్రామానికి పంపి, బాధితులతో నామినేషన్ వేయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు జ్యోతుల చెప్పారు.