హేమచంద్రారెడ్డి విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలి: ప్రణవ్ గోపాల్
ABN , First Publish Date - 2021-12-26T18:49:56+05:30 IST
హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి విద్యార్థులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు.

విశాఖపట్నం: ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి విద్యార్థులకు వెంటనే క్షమాపణలు చెప్పాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేశారు. విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రణవ్ గోపాల్ ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులను ఉద్దేశించి హేమచంద్రారెడ్డి గెటౌట్ అనడం దారుణమన్నారు. హేమచంద్రారెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థిని చదివిస్తామన్నసీఎం జగన్మోహన్రెడ్డి హామీని నిలబెట్టుకోవాలన్నారు. వైసీపీ ప్రభుత్వం వారం రోజుల్లో ఏపీ ఎంసెట్-2021 మూడోదశ కౌన్సెలింగ్ నిర్వహించకపోతే ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని ప్రణవ్ గోపాల్ హెచ్చరించారు.