మా ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్‌ లేఖ

ABN , First Publish Date - 2021-10-14T21:44:30+05:30 IST

మా ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్‌ లేఖ

మా ఎన్నికల అధికారికి ప్రకాశ్‌రాజ్‌ లేఖ

హైదరాబాద్: మా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ లేఖ రాశారు. ఎన్నికల రోజు సీసీటీవీ దృశ్యాలు ఇవ్వాలని ఎన్నికల అధికారిని కోరినట్లు ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. త్వరగా స్పందించకపోతే సీసీటీవీ ఫుటేజ్‌ను తొలగించడం లేదా మార్చేస్తారని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలకు సంబంధించిన ప్రతి సమాచారం పొందే హక్కు తమకు ఉందని ప్రకాశ్‌రాజ్‌ పేర్కొన్నారు. పోలింగ్‌రోజు కొంతమంది వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, మోహన్‌బాబు, నరేశ్‌ మా సభ్యులను బెదిరించారని, దాడులకు పాల్పడ్డారని ప్రకాశ్‌రాజ్‌ ఆరోపించారు. మీరే వారిని, వారి అనుచరులను పోలింగ్ ప్రదేశాల్లోకి అనుమతించారని భావిస్తున్నామని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. మా ఎన్నికలు జరిగిన తీరు జనంలో మనల్ని చులకన చేసిందని, అసలేం జరిగిందన్నది మా సభ్యులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారని ప్రకాశ్‌రాజ్‌ స్పష్టం చేశారు. పోలింగ్‌ సమయంలో సీసీ కెమెరాలు వాడినట్లు మీరే చెప్పారని, ఆ సీసీ టీవీ దృశ్యాలు తమకు ఇవ్వాలని ప్రకాష్‌రాజ్‌ ఎన్నికల అధికారిని కోరారు. సీసీటీవీ దృశ్యాలు కోరే హక్కు మాకు ఉందని, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 3 నెలల వరకు దృశ్యాలు భద్రపరచడం మీ బాధ్యత అని ప్రకాశ్‌రాజ్‌ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2021-10-14T21:44:30+05:30 IST