కందుకూరు బాలసదన్ నుంచి 14 ఏళ్ల బాలిక అదృశ్యం
ABN , First Publish Date - 2021-07-24T17:26:38+05:30 IST
జిల్లాలోని కందుకూరు బాలసదన్ నుంచి 14 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. బేస్తవారిపే మండలం బాలేశ్వరపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం తండ్రి చేతిలో బాలిక

ప్రకాశం: జిల్లాలోని కందుకూరు బాలసదన్ నుంచి 14 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. బేస్తవారిపే మండలం బాలేశ్వరపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం తండ్రి చేతిలో బాలిక అత్యాచారానికి గురైంది. అయితే.. బాలికను అధికారులు బాలసదన్‌లో చేర్చారు. రెండు రోజులుగా బాలసదన్ నుంచి బాలిక కనిపించకపోవడంతో..బాలసదన్ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులతో వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.