కడప: పోతురాజు ఆలయంలో చోరీ
ABN , First Publish Date - 2021-10-21T16:32:52+05:30 IST
రాజంపేట పట్టణం బలిజపల్లి గంగమ్మ ఆలయం ఎదురుగా ఉన్నటువంటి పోతురాజు ఆలయంలో తాళాలు పగలగొట్టి దుండగులు చోరీ చేశారు.

కడప : రాజంపేట పట్టణం బలిజపల్లి గంగమ్మ ఆలయం ఎదురుగా ఉన్నటువంటి పోతురాజు ఆలయంలో తాళాలు పగలగొట్టి దుండగులు చోరీ చేశారు. సుమారు పదివేల రూపాయలు దొంగిలించి తీసుకెళ్లి ఉంటారని గ్రామస్తులు చెబుతున్నారు. పోతురాజు విగ్రహం ఎదురుగా డబ్బులు చిందరవందరగా పడి ఉన్నాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.