రెండు స్థానాల్లో పోలింగ్‌ సమయం కుదింపు

ABN , First Publish Date - 2021-11-10T02:25:55+05:30 IST

రాష్ట్రంలో ఈ నెల 16న జరగాల్సిన ఎంపీటీసీ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోలింగ్‌

రెండు స్థానాల్లో పోలింగ్‌ సమయం కుదింపు

విజయవాడ: రాష్ట్రంలో ఈ నెల 16న జరగాల్సిన ఎంపీటీసీ ఎన్నికల్లో 2 స్థానాల్లో పోలింగ్‌ సమయాన్ని కుదిస్తూ ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం రెవిన్యూ డివిజన్‌లోని కోరుటూరు ఎంపీటీసీ, కుకునూరు రెవిన్యూ డివిజన్‌లోని మాధవరం ఎంపీటీీ స్థానాలకు పోలింగ్‌ సమయాన్ని కుదిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. మావోయిస్ట్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఈ రెండు ఎంపీటీసీ స్థానాలు ఉన్నందున జిల్లా కలెక్టరు ఇచ్చిన నివేధిక మేరకు సమయాన్ని కుదించినట్టు నోటిఫికేషన్లో వెల్లడించారు. ఒకవేళ ఈ రెండు స్థానాలకి రీపోలింగ్‌ జరిగితే పోలింగ్‌ సమయం మధ్యాహ్నం 2 గంటల వరకే ఉంటుందని నోటిఫికేషన్‌‌లో వెల్లడించారు.

Updated Date - 2021-11-10T02:25:55+05:30 IST