ప్రజలు అసహ్య పడేలా పోలీస్ వ్యవస్థ ఉంది: అచ్చెన్న
ABN , First Publish Date - 2021-02-26T22:32:34+05:30 IST
పోలీసులపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజలు అసహ్యం పడేలా పోలీస్ వ్యవస్థ ఉందని ఆయన తప్పుబట్టారు.

విజయవాడ: పోలీసులపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ప్రజలు అసహ్య పడేలా పోలీస్ వ్యవస్థ ఉందని ఆయన తప్పుబట్టారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత తిరుపతయ్యను అచ్చెన్నాయుడు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ అక్రమ దాడులను టీడీపీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. టీడీపీకీ ఓటు వేశారన్న కక్షతో ఒక గిరిజన వ్యక్తి ప్రాణాలు తీయాలనుకున్నారని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికలలో 40శాతం టీడీపీ గెలిచిందని, వైసీపీ ఓడిపోయిందని దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించాలని డిమాండ్ చేశారు. దాడి జరిగి వారం అవుతున్న పోలీసులు కేసు నమోదు చేయకుండా రాజీకీ రమ్మంటున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు.