‘గంజాయి’లో పోలీసులకు వాటా: అయ్యన్న

ABN , First Publish Date - 2021-10-19T08:32:41+05:30 IST

‘‘గంజాయి వ్యాపారంతో నాకు సంబంఽధాలున్నాయని హోంమంత్రి సుచరిత నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా’’ అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సవాల్‌ విసిరారు. సోమవారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

‘గంజాయి’లో పోలీసులకు వాటా: అయ్యన్న

  • జగన్‌కు, విజయసాయికి డబ్బు దాహమెక్కువ: బుద్దా వెంకన్న


విశాఖపట్నం, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ‘‘గంజాయి వ్యాపారంతో నాకు సంబంఽధాలున్నాయని హోంమంత్రి సుచరిత నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా’’ అని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు సవాల్‌ విసిరారు. సోమవారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విశాఖ జిల్లా నుంచి జరుగుతున్న గంజాయి రవాణాలో ఎక్సైజ్‌, పోలీస్‌ శాఖలకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. హెటిరోలో దొరికిన సొమ్ము సీఎం జగన్‌దే అన్నారు. ‘‘రాక్షసులకు రక్త దాహం వున్నట్టు జగన్‌, విజయసాయికి డబ్బు దాహం ఎక్కువ’’ అని ఆ పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న అన్నారు. మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి... గంజాయి రవాణాను అరికట్టడంలో డీజీపీ సవాంగ్‌ విఫలమయ్యారన్నారు.  విద్యుత్‌ సంక్షోభంపై ఈనెల 26న ఉత్తరాంధ్ర నుంచి ఆందోళనలు ప్రారంభిస్తామని మరో మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T08:32:41+05:30 IST