మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై కేసు

ABN , First Publish Date - 2021-05-13T18:33:18+05:30 IST

మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై కేసు నమోదైంది.

మంత్రిపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై కేసు

గుంటూరు: మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలపై కేసు నమోదైంది. కరోనా నిబంధనలు ఉల్లంఘించి గుంపుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చారని 188,269 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. వారిలో తెనాలి శ్రవణ్, కోవెలముడి రవీంధ్ర సహా పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. కాగా నిన్న మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. గుంటూరు అర్బన్ పోలీసుల వింత వైఖరి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Updated Date - 2021-05-13T18:33:18+05:30 IST