చంద్రబాబు దీక్షకు పోలీసుల అడ్డంకులు
ABN , First Publish Date - 2021-10-21T00:44:23+05:30 IST
టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ నేతల దాడికి నిరసనగా గురువారం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిరవధిక దీక్షకు ఉపక్రమించారు.

అమరావతి: టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై వైసీపీ నేతల దాడికి నిరసనగా గురువారం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నిరవధిక దీక్షకు ఉపక్రమించారు. అయితే చంద్రబాబు దీక్షకు పోలీసుల అడ్డంకులు సృష్టిస్తున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కార్యకర్తలు దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీక్ష కోసం వేస్తున్న టెంట్లు, సామగ్రిని పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబు నిరవధిక నిరసన దీక్ష చేపట్టనున్నారు. 36 గంటలపాటు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు దీక్ష చేయనున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేస్తారు. పార్టీ కీలక నేతల సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు దీక్ష సమయంలో ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలవనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను టీడీపీ నేతలు కలవనున్నారు.