పోలవరం, ‘సీమ’పై నేడు ఢిల్లీకి ఉన్నతాధికారులు
ABN , First Publish Date - 2021-01-20T09:07:50+05:30 IST
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు పెంచాలని.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్రానికి అర్జీలను సమర్పించేందుకు సిద్ధమైంది

అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు పెంచాలని.. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర జలవనరుల శాఖ కేంద్రానికి అర్జీలను సమర్పించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శిగా కొత్తగాబాధ్యతలు చేపట్టిన జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్తున్నారు.