గుండెలో సమస్య.. సాయం కోసం పదేళ్ల హేమంత్ ఎదురు చూపులు!

ABN , First Publish Date - 2021-12-13T23:04:59+05:30 IST

జిల్లాలోని‌ భట్టిప్రోలు మండలం రాసూరు గ్రామనికి చెందిన 10సంవత్సరాల మల్లెల హేమంత్ కు పుట్టకతోనే గుండెలో సమస్య ఉంది

గుండెలో సమస్య.. సాయం కోసం పదేళ్ల హేమంత్ ఎదురు చూపులు!

గుంటూరు: జిల్లాలోని‌ భట్టిప్రోలు మండలం రాసూరు గ్రామనికి చెందిన 10 సంవత్సరాల మల్లెల హేమంత్ గుండె జబ్బుతో బాధపడుతూ దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. హేమంత్ చికిత్స కోసం తల్లిదండ్రులు ఇప్పటికే లక్షలాది రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.


 తాజాగా వ్యాధి మరింత ముదరడంతో ఆపరేషన్ చేస్తే తప్ప వ్యాధి నయం కాదని వైద్యులు చెప్పడంతో హేమంత్ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్‌ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో దాతలు ముందుకు రావాలని అభ్యర్థిస్తున్నారు. మనసున్న మారాజులు ముందుకొచ్చి సాయం చేసి తమ కుమారుడి ప్రాణాలు నిలబెట్టాలని హేమంత్ తల్లిదండ్రులు సన్నీకృప, కిరణ్ లు కోరుతున్నారు.

Updated Date - 2021-12-13T23:04:59+05:30 IST