మధ్యతరగతి కోసం ‘ప్లాట్లు’

ABN , First Publish Date - 2021-01-13T08:09:10+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేటు వ్యాపారులకంటే తక్కువ ధరలకు ఇళ్ల స్థలాలను విక్రయించేందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందిస్తోంది. దీనికి ’పట్టణ ప్రణాళికా పథకం’ అని పేరు పెట్టారు.

మధ్యతరగతి కోసం ‘ప్లాట్లు’

పథకం విధాన రూపకల్పనకు కమిటీ   


అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి కుటుంబాలకు ప్రైవేటు వ్యాపారులకంటే తక్కువ ధరలకు ఇళ్ల స్థలాలను విక్రయించేందుకు ప్రభుత్వం ఒక పథకాన్ని రూపొందిస్తోంది. దీనికి ’పట్టణ ప్రణాళికా పథకం’ అని పేరు పెట్టారు. భూసేకరణ, లేఅవుట్ల అభవృద్ధి, అమ్మకాలు వంటివాటిని ఈ పథకం కింద చేపడతారు. వీటికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన కోసం ముగ్గురు అధికారులతో కూడిన కమిటీని నియమిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీకి చైర్మన్‌గా ఏపీటిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్‌, సభ్యులుగా డీటీసీపీ వి. రాముడు, గృహనిర్మాణ మండలి వైస్‌ చైర్మన్‌ బి. రాజగోపాల్‌ నియమితులయ్యారు. కాగా, ఈ నెల 21లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. 

Updated Date - 2021-01-13T08:09:10+05:30 IST