ఆ ఘటన బాధాకరం: పీతల సుజాత

ABN , First Publish Date - 2021-06-21T21:03:23+05:30 IST

కృష్ణానదిలో యువతిపై జరిగిన ఘటన బాధాకరమని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీమంత్రి పీతల సుజాత అన్నారు.

ఆ ఘటన బాధాకరం: పీతల సుజాత

అమరావతి: తాడేపల్లి ఘటన చాలా బాధాకరమని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీమంత్రి పీతల సుజాత అన్నారు. సోమవారం సుజాత  మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పోలీస్ వ్యవస్థ చర్యలు కంటి తుడుపుగా ఉన్నాయన్నారు. సంఘటన జరిగిన తర్వాత పోలీసులు హడావుడి చేయడం తప్ప.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడం లేదన్నారు.దిశ యాప్‌లు, దిశ పీఎస్‌లు కేవలం ప్రచారం కోసమేనన్నారు. సీఎం జగన్ స్పందించి యువతికి న్యాయం చేయాలని పీతల సుజాత డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-06-21T21:03:23+05:30 IST