రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-21T15:47:09+05:30 IST

కొండాపురం మండలంలోని కే.సుగుమాంచి పల్లి గ్రామానికి చెందిన కత్తి పెద్దిరాజు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కడప : కొండాపురం మండలంలోని కే.సుగుమాంచి పల్లి గ్రామానికి చెందిన కత్తి పెద్దిరాజు అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తాళ్ల పొద్దుటూరు ఆర్అండ్ఆర్ సెంటర్‌లో కూలి పనికి ద్విచక్ర వాహనంపై వెంకటేష్ అనే వ్యక్తితో కలిసి పెద్దిరాజు వెళ్తుండగా తాడపత్రి-కడప బైపాస్ రోడ్డులో లారీ ఢీకొట్టింది. దీంతో పెద్దిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేష్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-10-21T15:47:09+05:30 IST