పార్టీ ఆఫీస్‌లో రెండు బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా?: పేర్ని నాని

ABN , First Publish Date - 2021-10-21T19:54:14+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష ఎందుకు? ఎవరి కోసం? చేస్తున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఇది ఒక క్షుద్ర కార్యక్రమమన్నారు.

పార్టీ ఆఫీస్‌లో రెండు బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా?: పేర్ని నాని

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష ఎందుకు? ఎవరి కోసం? చేస్తున్నారని మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఇది ఒక క్షుద్ర కార్యక్రమమన్నారు. చంద్రబాబు దిగజారి రాజకీయాలు చేస్తున్నారన్నారు. స్క్రిప్టు రాయించి బూతులు తిట్టిస్తారా? అని పేర్ని నాని ఫైర్ అయ్యారు. 36 గంటల దీక్ష పేరుతో కొంగ జపం చేస్తున్నారన్నారు. పార్టీ ఆఫీస్‌లో రెండు బల్లలు విరిగితే రాష్ట్రపతి పాలన పెట్టాలా? అని ప్రశ్నించారు. అమిత్‌షాపై అల్లరిమూకలను ఎగదోసినప్పుడు ఆర్టికల్ 356 గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. చంద్రబాబు జీవితమంతా నేరమయమన్నారు. ఇలాంటి ప్రతిపక్షం ఉండడం తమ దురదృష్టమని పేర్ని నాని పేర్కొన్నారు.


Updated Date - 2021-10-21T19:54:14+05:30 IST