అద్దె భవనాల్లో ఉన్నా డిగ్రీ కోర్సులకు అనుమతులు

ABN , First Publish Date - 2021-11-02T08:35:46+05:30 IST

అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లోని డిగ్రీ కోర్సులకు కూడా ఈ ఏడాది అనుమతి ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యామండలి

అద్దె భవనాల్లో ఉన్నా డిగ్రీ కోర్సులకు అనుమతులు

అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లోని డిగ్రీ కోర్సులకు కూడా ఈ ఏడాది అనుమతి ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి పదేళ్లకు పైగా లీజు భవనాల్లో ఉన్న ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల్లోని గ్రాడ్యుయేషన్‌ కోర్సులకు అనుమతి ఇవ్వకూడదని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే దానికి ఇప్పుడు మినహాయింపు ఇచ్చింది దీనికోసం ఉన్నత విద్యామండలికి మూడో తేదీలోగా మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Updated Date - 2021-11-02T08:35:46+05:30 IST