వింత శబ్దాలతో జనం బెంబేలు.. అసలు విషయం చెప్పిన అధికారులు

ABN , First Publish Date - 2021-11-23T15:35:20+05:30 IST

పూతలపట్టు మండలం తుంబవారిపల్లిలో వింత శబ్దాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. భయంతో గ్రామస్తులు పరుగులు తీశారు.

వింత శబ్దాలతో జనం బెంబేలు.. అసలు విషయం చెప్పిన అధికారులు

చిత్తూరు : పూతలపట్టు మండలం తుంబవారిపల్లిలో వింత శబ్దాలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. భయంతో గ్రామస్తులు పరుగులు తీశారు. రాత్రంతా ఇళ్ల బయట జాగారం చేశారు. భూకంపం వచ్చిందని పలువురు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అయితే అది భూకంపం కాదని భూమి లోపల నుంచి వస్తున్న వింత శబ్దాలని అధికారులు గుర్తించారు. గ్రామం రెండు ఎత్తైన కొండల మధ్య ఉండడం, గతంలో వందల సంఖ్యలో బోర్లు వేసి నీళ్లు పడకపోవడం ప్రస్తుతం భారీ వర్షాలకు ఆ బోర్లోకి నీరు చేరడం వంటి పరిణామాలతో వింత శబ్దాలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి తోడు భూమి లోపల ఖాళీ పొరలు ఏర్పడి ప్రస్తుతం వర్షపు నీరు చేరడంతో వింత శబ్దాలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Updated Date - 2021-11-23T15:35:20+05:30 IST