పోలవరాన్ని పూర్తిచేయాల్సింది కేంద్రమే: తులసిరెడ్డి
ABN , First Publish Date - 2021-03-24T09:15:08+05:30 IST
పోలవరాన్ని పూర్తిచేయాల్సింది కేంద్రమే: తులసిరెడ్డి

వేంపల్లె, మార్చి 23: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారని, చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. మంగళవారం వేంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2013-14 నాటి అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20,398 కోట్లు మాత్రమే ఇస్తాననడం మోసం, అన్యాయమన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా రూ.50వేల కోట్లు భారం పడుతుందన్నారు. మోసకారి, అసమర్థ పార్టీలను, నేతలను అందలమెక్కిస్తే ఇలాగే ఉంటుందని ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు.