టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించిన పీసీసీ బృందం

ABN , First Publish Date - 2021-10-20T09:16:35+05:30 IST

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రతినిధి బృందం మంగళవారం రాత్రి సందర్శించింది.

టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించిన పీసీసీ బృందం

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రతినిధి బృందం మంగళవారం రాత్రి సందర్శించింది. కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన నేపథ్యంలో పీసీసీ చీఫ్‌ సాకే శైలజానాథ్‌ ఆదేశాల మేరకు పీసీసీ సెక్రటరీ(అడ్మిన్‌ ఇన్‌చార్జి) నూతలపాటి రవికాంత్‌, ప్రధాన కార్యదర్శి చిలకా విజయ్‌కుమార్‌, మైనార్టీ సెల్‌ జిల్లా చైర్మన్‌ షేక్‌ సలీం ఘటనా స్థలిని పరిశీలించారు. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి, దాడిపై విచారం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-20T09:16:35+05:30 IST