అగ్రిగోల్డ్‌ బాధితుల హామీ నెరవేర్చుతారా?: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-05-20T09:18:03+05:30 IST

అగ్రిగోల్డ్‌ బాధితుల హామీ నెరవేర్చుతారా?: తులసిరెడ్డి

అగ్రిగోల్డ్‌ బాధితుల హామీ నెరవేర్చుతారా?: తులసిరెడ్డి

విజయవాడ, మే 19 (ఆంధ్రజ్యోతి) : అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయించి, 13 లక్షల మందికి తక్షణ న్యాయం చేస్తామని వైసీపీ ఇచ్చిన హామీ 2021-22 బడ్జెట్‌లో అయినా నెరవేర్చుతారా అని ప్రభుత్వాన్ని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌.తులసిరెడ్డి ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఈ బాధితుల కోసం 2019-20 బడ్జెట్‌లో రూ.1150 కోట్లు కేటాయించి రూ.264 కోట్లు మాత్రమే విడుదల చేశారని తెలిపారు. 2020-21 బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి విడుదల చేయలేదని, 2021-22 బడ్జెట్‌లో అయినా అగ్రిగోల్డ్‌ బాధితుల కోసం రూ.4 వేల కోట్లు కేటాయించి, విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-20T09:18:03+05:30 IST