దగాకోరు మాటలొద్దు: శైలజానాథ్‌

ABN , First Publish Date - 2021-11-23T09:02:32+05:30 IST

‘మూడు రాజధానులపై దగాకోరు మాటలొద్దు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారకుండా ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలి.

దగాకోరు మాటలొద్దు: శైలజానాథ్‌

అనంతపురం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘‘మూడు రాజధానులపై దగాకోరు మాటలొద్దు. కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారకుండా ఈ విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలి. మరోసారి బిల్లులు తెస్తామని చెప్పడం దుర్మార్గం’’ అని పీసీసీ చీఫ్‌ సాకే శైలజానాథ్‌ అన్నారు.మూడు రాజధానుల అనాలోచిత నిర్ణయానికి బాధ్యులెవరని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకూ జరిగిన నష్టానికి ఎవరు సమాధానం చెబుతారని నిలదీశారు. అధికార వికేంద్రీకరణపై మాట్లాడే హక్కు జగన్‌రెడ్డికి లేదన్నారు. పాత చట్టం తీసేసి కొత్త చట్టంతో వస్తామన్న దానికి అర్థంపర్థం లేదని తప్పుబట్టారు. వికేంద్రీకరణ పేరుతో మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకే జగన్‌ వ్యాఖ్యలు ఉన్నాయని దుయ్యబట్టారు. 

Updated Date - 2021-11-23T09:02:32+05:30 IST