వెంటనే బకాయిలు చెల్లించండి
ABN , First Publish Date - 2021-10-20T09:15:39+05:30 IST
నీరు-చెట్టు, ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులన్నీ వెంటనే చెల్లించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం టీడీపీ జాతీయ కార్యాలయంలోని నీరు-చెట్టు,

పెండింగ్‌లో నీరు-చెట్టు, ఉపాధి హామీ బిల్లులు: టీడీపీ
అమరావతి, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): నీరు-చెట్టు, ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు ప్రభుత్వం పెండింగ్ పెట్టిన బిల్లులన్నీ వెంటనే చెల్లించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం టీడీపీ జాతీయ కార్యాలయంలోని నీరు-చెట్టు, ఉపాధి హామీ పథకం ఫిర్యాదుల విభాగం పురోగతిని టీడీపీ నేతలు బీద రవిచంద్ర, పర్చూరి అశోక్‌బాబు, మద్దిపాటి వెంకటరాజు సమీక్షించారు. ఈ సందర్భంగా నీటి సంఘాల నేతలు, ఉపాధి హామీ మండలి మాజీ సభ్యులు పెండింగ్ బిల్లు ల విషయాలను టీడీపీ నేతల దృష్టికి తెచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాం లో నీరు-చెట్టు పథకం కింద చేపట్టిన పనులకు రూ.1,277 కోట్లు సీఎ్‌ఫఎంఎ్‌సలో పెండింగ్‌లో పెట్టడం వల్ల సన్న, చిన్నకారు రైతులు, నీటి సంఘాల ప్రతినిధులు అప్పుల పాలయ్యారని సాగునీటి సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకటగోపాలకృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటి వరకు రూ.1,500 కోట్లు చెల్లించారని తెలిపారు. ఇంకా రూ.వెయ్యి కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.