‘పవన్ 1, 2తేదీల్లో మత్స్యకార ప్రాంతాలలో పర్యటిస్తారు’

ABN , First Publish Date - 2021-10-25T18:25:55+05:30 IST

ఈ నెల 31న విశాఖకు పవన్ కల్యాణ్ వస్తున్నారని జనసేన పార్టీ మత్స్య వికాస విభాగం నేతలు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో పాల్గొంటారన్నారు.

‘పవన్ 1, 2తేదీల్లో మత్స్యకార ప్రాంతాలలో పర్యటిస్తారు’

విశాఖపట్నం : ఈ నెల 31న విశాఖకు పవన్ కల్యాణ్ వస్తున్నారని జనసేన పార్టీ మత్స్య వికాస విభాగం నేతలు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో పాల్గొంటారన్నారు. నవంబర్ 1, 2తేదీల్లో మత్స్యకార ప్రాంతాలలో పర్యటిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల పట్ల చిన్న చూపు చూస్తోందన్నారు. మత్యకారుల సమస్యలపై మంత్రులు మాట్లాడకపోవడం దారుణమన్నారు. మత్స్యకారులకు ఆయిల్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. మత్యకారులు సముద్రంలో వేటకు వెళ్లిన సమయంలో చనిపోతే ఆర్ధికంగా ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ మత్స్య వికాస విభాగం నేతలు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-25T18:25:55+05:30 IST