పిళ్లా కన్నుమూతతో తీవ్ర ఆవేదనకు లోనయ్యా: పవన్
ABN , First Publish Date - 2021-05-06T04:38:21+05:30 IST
పిళ్లా కన్నుమూతతో తీవ్ర ఆవేదనకు లోనయ్యా: పవన్

అమరావతి: రాష్ట్ర కాపు నాడు సహ వ్యవస్థాపకుడు పిళ్లా వెంకటేశ్వర రావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని పవన్ కల్యాణ్ తెలిపారు. వెంకటేశ్వర రావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. కాపుల సమస్యలపై ఆయన స్పందించిన విధానాన్ని ఎన్నటికీ మరచిపోలేమన్నారు. కాపుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పిళ్లా పని చేశారని గుర్తు చేశారు వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకు తన తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పవన్ పేర్కొన్నారు.