రోడ్డు ప్రమాదంలో కూలీల దుర్మరణంపై పవవ్ కల్యాణ్ దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2021-03-14T18:34:20+05:30 IST

రోడ్డు ప్రమాదంలో కూలీల దుర్మరణంపై పవవ్ కల్యాణ్ దిగ్భ్రాంతి

రోడ్డు ప్రమాదంలో కూలీల దుర్మరణంపై పవవ్ కల్యాణ్ దిగ్భ్రాంతి

నూజివీడు: కృష్ణా జిల్లాలో నూజివీడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీలు దుర్మరణం చెందడంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవనం కోసం పనులకు వెళ్లి మృత్యువాతపడటం దురదృష్టకరమని పవన్ కల్యాణ్ అన్నారు. 

మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పవన్ చెప్పారు. మృతులు, క్షతగాత్రులు రెక్కాడితేగానీ డొక్కాడని పేదలని, వారి కుటుంబాలకు మెరుగైన పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-03-14T18:34:20+05:30 IST