పోలీసు కస్టడీలో నాకు ప్రాణహాని ఉంది: పట్టాభి

ABN , First Publish Date - 2021-10-21T02:57:47+05:30 IST

పోలీసు కస్టడీలో నాకు ప్రాణహాని ఉంది: పట్టాభి

పోలీసు కస్టడీలో నాకు ప్రాణహాని ఉంది: పట్టాభి

విజయవాడ: తనను పోలీసులు అరెస్ట్‌ చేసే అవకాశముందని టీడీపీ నేత పట్టాభి వీడియో విడుదల చేశారు. వీడియోలో తేదీ, సమయం కూడా చూపించారు. తన ఒంటిపై ప్రస్తుతం ఎలాంటి గాయాలు లేవని చూపించారు. పోలీసు కస్టడీలో తనకు ప్రాణహాని ఉందని పట్టాభి ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఉదంతం నేపథ్యంలో వీడియో విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుపై తనకు నమ్మకం ఉందని వీడియోలో వెల్లడించారు. తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా పోలీసులదే బాధ్యత అని పట్టాభి పేర్కొన్నారు. 


కాగా విజయవాడలోని  పట్టాభి ఇంటికి పోలీసులు చేరుకున్నారు. పట్టాభిని అరెస్ట్‌ చేసేందుకు తలుపులు పగలగొడుతున్నారు. కుటుంబసభ్యులతో కలిసి  పట్టాభి ఇంట్లోనే ఉన్నారు. మీడియా, కార్యకర్తలను బలవంతంగా పోలీసులు బయటికి పంపించారు.

Updated Date - 2021-10-21T02:57:47+05:30 IST