ఏ క్షణమైనా పట్టాభి అరెస్ట్.. ఇంటి వద్ద హై టెన్షన్
ABN , First Publish Date - 2021-10-21T02:34:49+05:30 IST
టీడీపీ నేత పట్టాభి ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో పట్టాభి ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టాభి నివాసంలో...

అమరావతి: టీడీపీ నేత పట్టాభి ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో పట్టాభి ని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టాభి నివాసంలోని సీసీ ఫుటేజ్, హార్డ్ డిస్క్, డీవీఆర్‌ను పోలీసులు అడుగుతున్నారు. ఎఫ్ఐఆర్లో ఇవి ఇస్తామని పోలీసులు పేర్కొనట్లు సమాచారం. అయితే పెన్ డ్రైవ్‌లో సీసీ టీవీ ఫుటేజ్ ఇచ్చేందుకు పట్టాభి స్నేహితులు ప్రయత్నం చేశారు. పెన్ డ్రైవ్ తీసుకొనేందుకు పోలీసులు నిరాకరించారు. మరోవైపు పట్టాభి ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. పట్టాభి నివాసంపై వైసీపీ దాడిని తప్పుబట్టాయి.