నన్ను పోలీసులు కొట్టలేదు: పట్టాభి
ABN , First Publish Date - 2021-10-21T22:44:35+05:30 IST
తనను పోలీసులు కొట్టలేదని టీడీపీ నేత పట్టాభి తెలిపారు. సీఎం జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారని...

అమరావతి: తనను పోలీసులు కొట్టలేదని టీడీపీ నేత పట్టాభి తెలిపారు. సీఎం జగన్పై ఘాటు వ్యాఖ్యలు చేశారని బుధవారం అర్థరాత్రి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే పట్టాభి మాట్లాడుతూ సీఎంను గాని, ప్రభుత్వ పెద్దలనుగానీ తూలనాడలేదన్నారు. ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపానని చెప్పారు. గతంలో తనపై దాడి జరిగితే దోషులను పట్టుకోలేదని తెలిపారు. అరెస్ట్ చేసిన తర్వాత తనను తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్లో ఉంచారని పట్టాభి పేర్కొన్నారు. .