పట్టాభి కస్టడీ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం

ABN , First Publish Date - 2021-10-29T01:23:58+05:30 IST

టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను మూడో

పట్టాభి కస్టడీ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం

విజయవాడ: టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను మూడో ఏసీఎం కోర్టు గురువారం కొట్టివేసింది. ఐదు రోజుల క్రితం పట్టాభిని అరెస్టు చేసిన తర్వాత కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావించారు. దీనిపై పిటిషన్‌ దాఖలు చేశారు. పట్టాభి తరపు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. పట్టాభికి ఇప్పటికే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసినందున పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ ఇన్‌ సక్సెస్‌ అవుతుందని ఆయన వాదించారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి సత్యాదేవి పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చారు.  

Updated Date - 2021-10-29T01:23:58+05:30 IST