పట్టాభిని కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు

ABN , First Publish Date - 2021-10-21T16:39:49+05:30 IST

విజయవాడలో తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ రోడ్డులో గడ్డి మోపులతో వెళ్తున్న రైతులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు.

పట్టాభిని కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు

విజయవాడ: విజయవాడలో తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ రోడ్డులో గడ్డి మోపులతో వెళ్తున్న రైతులను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారు. తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్‌లోనే టీడీపీ నేత పట్టాభిని రాత్రి విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కోర్టులో పోలీసులు హాజరుపరచనున్నారు. తోట్ల వల్లూరు పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలను కఠినతరం చేస్తున్నారు. ఊళ్ళోకి వెళ్లే రోడ్లను సైతం పోలీసులు మూసేశారు. స్థానికులకు తప్ప ఇతరులకు గ్రామంలోకి ప్రవేశం లేదని పోలీసులు చెబుతున్నారు. 


Updated Date - 2021-10-21T16:39:49+05:30 IST