Pattabhi arrest కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు
ABN , First Publish Date - 2021-10-29T14:12:15+05:30 IST
టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్టు కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. అరెస్ట్ సమయంలో నిబంధనలు సరిగ్గా పాటించలేదని ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అరెస్టు కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. అరెస్ట్ సమయంలో నిబంధనలు సరిగ్గా పాటించలేదని ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏసీపీ రమేష్, సీఐ నాగరాజును విధుల నుంచి తప్పించారు. అరెస్టు సమయంలో ఖాళీలతో నోటీస్ ఇచ్చినందుకే బదిలీ జరిగినట్లు సమాచారం. ఖాళీలతో నోటీస్ ఇవ్వడంపై మేజిస్ట్రేట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏసీపీ రమేష్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సీఐ నాగరాజును ఏలూరు రేంజి డీఐజీకి రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు పంపించింది.